సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమతున్నాయి మహకూటమిలోని భాగస్వామ్య పార్టీలు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో భేటీ అయిన ఎల్.రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ సీపీఐకి మూడు స్థానాలనే ఇస్తామనడంతో ఐదు స్థానాలు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. టీడీపీకి 14 సీట్లు ఇస్తామన్నడంతో మరో రెండు సీట్లు కావాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాసేపట్లో పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్‌తో భాగస్వామ్య పార్టీ నేతలు భేటీకానున్నాయి. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు సీట్లపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సీట్లతో పాటు స్థానాలపై కూడా క్లారిటీ ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న భాగస్వామ్య పార్టీలు సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచి, తమ పంతం నెగ్గించుకోవాలని భావిస్తున్నాయి.