అన్నం పెట్టండి మహాప్రభో అంటూ వసతి గృహం ఎదుట పలువురు మహిళలు బైఠాయించారు. మూడురోజులుగా వసతి గృహం సూపరింటెండెంట్ తమకు తిండి పెట్టడంలేదంటూ ఆరుగురు హాస్టల్ మహిళలు మంగళవారం రాత్రి తిరుపతి వసతిగృహం ప్రధానద్వారం ఎదుట బైఠాయించారు. వేరు వేరు ప్రాంతాలకు చెందిన తాము తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ.. వసతి గృహంలో ఉంటున్నామని.. కొద్ది రోజుల కిందటే వసతి గృహంలో తమ గడువు ముగిసినందున రెన్యూవల్ చేయించుకోలేదని సూపరింటెండెంట్ తమకు అన్నం పెట్టడం లేదని వాపోయారు. రెన్యువల్ చేసుకునేందుకు డీడీలు కూడా కట్టి అధికారులకు పంపకున్నామని వెల్లడించారు. కానీ సదరు ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇక్కడ ఉండొద్దని సూపరింటెండెంట్ చెప్పారని వారు ఆరోపించారు.