తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మరోసారి ప్రస్తావన తెచ్చారు. రాహుల్ గాంధీని పప్పుతో పోల్చుతూ ఆయనకంటే పెద్ద పప్పూ మరవెరు లేంటూ ఎద్దేవా చేశారు.
కొద్దిరోజుల క్రితం జరిగిన దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. అయితే దీనిపై టీ కాంగ్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఈ సదస్సు రావాలని కేటీఆర్ ను ఆహ్వానించలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్... చాలా ఘాటుగా స్పందించారు. తనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి అందిన ఇన్విటేషన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి తోడు మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను బహిరంగ పరుస్తున్నాను. ఉత్తమ్ గారూ.. నేను పప్పును కాదు. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా` అని కేటీఆర్ సదరు ట్వీట్లలో పేర్కొన్నారు.
మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పుతో పోల్చుతూ ఆయనకంటే పెద్ద పప్పూ మరవెరు లేంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బాహుబలి సినిమా కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. టీడీపీ, బీజేపీతో ఉన్నట్లా..? లేనట్లా..? కేంద్రపై పోరాటం చేసేందుకు బీజేపీ నుంచి ఎవరు లేరు. కేంద్రంలో దత్తాత్రేయ ఉంటే ఆయన్ని తొలగించారు. ఇక రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అంబర్ పేట దాటి మాట్లాడరని దుయ్యబట్టారు.
ఇక చరిత్ర అంటే కాంగ్రెస్ గురించే చెప్పుకోవాలి. పార్టీలో పదవులకోసం పార్టీ నేతల్ని హత్య చేసిన ఘనమైన చరిత్ర వారికే ఉందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 1991లో చేసిన నరమేధాన్ని మరిచిపోయి నల్గొండ హత్య గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. స్థానికంగా హత్య జరిగితే దాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. ఇప్పటి వరకు జరిగిన ఏ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్‌కు గౌరవ ప్రదమైన ఓట్లు రాలేదని చెప్పారు. 2019లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని, భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.