ముఖ్యమంత్రి కేసీఆర్.... ఈనెల 9న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు హరీష్ ప్రకటించారు. సీఎస్‌ఐ గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లను ...స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హరీష్‌రావు పర్యవేక్షించారు. ఇక తెలంగాణలో అమలవుతోన్న పథకాలు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని, ముఖ్యంగా రైతుబంధు పథకం... దేశం దృష్టినే తనవైపు తిప్పుకుంటోందన్నారు.