కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన టూర్ మొదలైంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. కేసీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠం చేరుకున్నారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటలా 30 నిముషాలకు కేసీఆర్ విశాఖ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తారు.