తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన క్రిటిక్ కత్తిమహేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. కాటమరాయుడు సినిమా రివ్వూతో వెలుగులోకి వచ్చిన కత్తిమహేష్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా, పాలిటిక్స్ , వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశాడు. ఆ విమర్శలతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అభిమానానికి బలయ్యాడు. కత్తి ఫోన్ నెంబర్ ను బహిర్గతం చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కత్తి అభిమానులపై రుసరుసలాడాడు. అభిమానులు తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తుంటే పవన్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడని , తక్షణమే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అప్పటి నుంచి నువ్వా - నేనా అన్నట్లు పవన్ అభిమానులు , కత్తిమహేష్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఒకానొక సందర్భంలో కత్తి మహేష్ పై పవన్ అభిమానులు గుడిగుడ్లతో దాడి చేయడంతో ఈవివాదం తారాస్థాయికి చేరింది.
ఓ ఛానల్ డిబెట్ లో పాల్గొనేందుకు వెళుతుండగా పవన్ అభిమానులు కత్తిమహేష్ కారును అడ్డగించి అతడిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన కత్తి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టాడు. ఆ కేసు వివాదం కొనసాగుతుండగానే పెద్దమనుషుల జోక్యంతో ఆ కేసును వెనక్కితిరిగి తీసుకోవడంతో ఆ వివాదం సమిసి పోయింది. అప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న పవన్ అభిమానులు - కత్తిమహేష్ ఒక్కటయ్యారు.
ఈ నేపథ్యంలో కత్తిమహేష్ గురించి వెబ్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కెర్లుకొడుతుంది. అందేంటంటే పవన్ కల్యాణ్ జనసేన తరుపున కత్తిమహేష్ కు 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు టాక్ . కాగా తిరుపతి ఎంపి సీట్ కత్తి మహేష్ కి ఇస్తే కచ్చితంగా గెలుస్తాడని..తిరుపతిలో పవన్ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ..పవన్ కు మద్దతు పలుకుతున్నకత్తిమహేష్ కు ఇస్తే బాగుటుందని పలువురు సూచనప్రాయంగా పవన్ తో అన్నారట.
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి కత్తి మహేష్ కూడా ఎప్పుడు జనసేన లో చేరనని చెప్పలేదు. పార్టీ విధి విధానాలు నచ్చితే పార్టీ లో చేరాతానని చెప్పాడు. ఇప్పడు కత్తి మహేష్ పబ్లిక్ ఫేం కాబట్టి అది కచ్చితంగా పార్టీ కి ఉపయోగపడుతుంది అని జనసేన పార్టీ వారు అంచనా వేస్తున్నారు.