తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. వాటర్ ట్యాంకు పైకెక్కి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ మాత్రం మౌనంగా పాదయాత్రను సాగిస్తున్నారు.