కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో విశ్వప్రసాద్, భరత్ చౌదరి నిర్మాతలుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూల్ లో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ అయ్యింది. మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.