తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ఎస్ పార్టీలో మరో ఎన్నికల సందడి తెరమీదకు వచ్చింది. కీలకమైన రాజ్యసభ స్థానాలకు పోటీ పడే ఆశావహుల పేర్లు జోరుగా తెరమీదకు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుల జాబితాలో మరో పేరు జత కానుందని అంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రి కేసీఆర్ వదిన కుమారుడు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్. ఆయన పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ సేనానికి ఆయన అడుగుజాడ. ప్రత్యేక రాష్ట్ర పోరు వెళ్లువెత్తుతోన్న వేళ ఆయన అలుపెరుగని శ్రామికుడు. ఉద్యమ అవసరాలు.. పార్టీ పనులు.. అధినేత వ్యవహారాలు ఒంటి చేత్తో చక్కబెట్టిన సమర్థుడు. ఎలాంటి పనినైనా సులువుగా చేసిపెట్టగల నేర్పరి. ఇన్ని మంచి గుణాలు ఉన్నా.. ఆయన ఇన్నాళ్లు తెరచాటు నాయకుడే. ప్రత్యక్ష రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నా ఏనాడూ తనకంటూ గుర్తింపును కోరుకోలేదు. అలాంటి అడుగు జాడ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ చిత్రపటంపై అరంగేట్రం చేస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవితో ఆరంభమైన ప్రస్థానం 2019 ఎన్నికల్లో వేములవాడ క్షేత్రం నుంచి చట్టసభవైపునకూ అడుగులు వేస్తోంది. ఆయనే టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్.
కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ సుపరిచితులే. కేసీఆర్‌తో, టీఆర్‌ఎస్‌తో సంబంధాలున్న వారికి తప్ప బాహ్య ప్రపంచానికి ఆయన పెద్దగా పరిచయం లేరు. 2001లో టీఆర్‌ఎస్ పురుడు పోసుకున్నది మొదలు సంతోష్ అధినేత కేసీఆర్ వెన్నంటే నడిచారు. పార్టీ ఉత్తానపతనాల్లోనూ ఆయన కేసీఆర్ నీడలాగే ఉన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నాడు పిడికెడు మంది ఆరంభమైన ఉద్యమంలో సంతోష్ పాత్రధారి. కేసీఆర్, ఆచార్య జయశంకర్ వెన్నంటే ఉంటూ టీఆర్‌ఎస్ ప్రతి పరిణామంలోనూ తనదైన పాత్ర పోషించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సంతోష్ స్వయానా కేసీఆర్ తోడల్లుడి కుమారుడు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నా.. కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నా… ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేయలేదు. ఉద్యమ అవసరాల రీత్యా ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు సాగించారు సంతోష్. కేసీఆర్ కరీంనగర్‌లో పోటీ చేసినా.. ఉప ఎన్నికలకు వెళ్లినా.. మహబూబ్‌నగర్ వెళ్లినా.. గజ్వేల్ వెళ్లిన అక్కడ సంతోష్ ప్రజెన్స్ మస్ట్. ఊపిరి సలపనంత పని ఉన్న చిరునవ్వుతో ఫ్రెష్‌గా కనిపించడం సంతోష్ స్టయిల్.
పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఏర్పాటు వరకూ ఎన్నో ఆటుపోట్లను చవిచూసినా ఏనాడు వెన్నుచూపలేదు. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా జట్టుకట్టి 10 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన వేళ కేసీఆర్‌తో కలిసే పనిచేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష, ఉద్యమ వ్యూహ రచన, ఇలా ప్రతి ఉద్యమ పరిణామంలో రాముడికి హనుమంతుడిలా వెన్నంటి నిలిచాడు సంతోష్. ఉద్యమంలో తర్వాత వచ్చిన వాళ్లు ముందు వరుసలోకి వెళ్లిపోయినా ఏనాడు నిరుత్సాహ పడలేదు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ తన పని తాను చేసుకుపోయారు.
ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యకవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు సీఎం కేసీఆర్. తద్వారా పార్టీలో సంతోష్‌కు కీలక ¬దా కట్టబెట్టారు. రాబోయే ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేయడంతో పాటు లోటుపాట్లను కనుగొనడం.. అధినేత దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం చూపడం ఇప్పుడు సంతోష్ ముందున్న సవాళ్లు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం వేములవాడపై దృష్టి సారించాల్సిన కీలక తరుణం. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ పంచాయితీతో వేములవాడ స్థానం కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. న్యాయస్థానాల్లో చెన్నమనేని పౌరసత్వంపై ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాటికి చెక్ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఆ నియోజకవర్గం తమ కుటుంబానికే చెందిన సంతోష్‌ను భరిలో నిలిపితే విజయం నల్లేరుపై నడకే. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ను వేములవాడ నుంచి పోటీకి నిలుపుతామనే సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇన్నాళ్లు తన వెన్నంటే ఉండి తలలో నాలుకలా వ్యవహరించిన సంతోష్ ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గానికి సమర్థ సేవలందిస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
గులాబీ దళపతి గురించి లోతుగా తెలిసిన వారికి సంతోష్ సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ వెంట సంతోష్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఢిల్లీలో కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయన కేసీఆర్ వెంటనే ఉన్నారు. అదే సమయంలో ఎలాంటి పదవి ఆశించలేదు. పైగా ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ఆయన ముఖ్య సమన్వయ కర్తగా ఇటీవలి కాలంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పేరును రాజ్యసభ కోసం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటివారంలో రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రకటన ప్రకారం టీఆర్ఎస్ ఖాతాలో మూడు ఎంపీ స్థానాలు దక్కుతాయి. ఇప్పటికే యాదవ నేతకు ఓ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు స్థానాలపై చర్చ జరుగుతుండగా ఇందులో ప్రధానంగా సంతోష్ పేరు వినిపిస్తోంది. స్థూలంగా మరో పది పదిహేను రోజుల్లో కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడి అరంగేట్రం గురించి స్పష్టత రానుంది.
ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటివారంలో రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రకటన ప్రకారం టీఆర్ఎస్ ఖాతాలో మూడు ఎంపీ స్థానాలు దక్కుతాయి. ఇప్పటికే యాదవ నేతకు ఓ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు స్థానాలపై చర్చ జరుగుతుండగా ఇందులో ప్రధానంగా సంతోష్ పేరు వినిపిస్తోంది. స్థూలంగా మరో పది పదిహేను రోజుల్లో కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడి అరంగేట్రం గురించి స్పష్టత రానుంది.