తనదైన కామెంట్స్‌తో రోజుకో వివాదం పూటకో రాద్ధాంతం చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాజకీయ విమర్శలతో వివాదాలు రేపిన ఆయన తాజాగా పోలీస్ వ్యవస్ధ తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఫ్రెండ్లీ పోలీస్‌తో శాంతిభద్రతలు కాపాడలేరన్న ఆయన ఆలూరులో ఎస్సైపై దాడి జరిగితే ఫిర్యాదు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. పోలీసుల్లో చావ చచ్చిందా అంటూ ప్రశ్నించిన జేసీ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. జిల్లాల్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.