నేను వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది: పవన్‌కల్యాణ్

Update: 2017-12-23 06:32 GMT

విశాఖలో మహిళపై దాడిని ఖండించారు జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్‌లో స్పందించారు పవన్‌. తాను నేరుగా వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్న పవన్‌- బాధితురాలికి న్యాయం జరిగి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. విశాఖలో మహిళపై దాడికి కులం రంగు పులుమొద్దన్నారు జనసేనాని. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే... జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు పవన్‌కల్యాణ్‌.

Similar News