సీఎం చంద్రబాబు దావోస్ టూర్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు సదస్సు మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలదన్నట్లు ఏపీ లో తూర్పు గోదావరి జిల్లా వైర. రామవరం మండలం జాజి వలస గ్రామంలో ఏం జరుగుతుందనే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చంద్రబాబు మనిషా రోబోనా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే తూర్పుగోదావరి జిల్లాలో జాజి అనే గ్రామానికి కనీస సదుపాయం కూడా లేదు. జనజీవనంలో అడుగు పెట్టాలంటే ఆ ఊరి నుంచి 80కిలో మీటర్లు బయటకు రావాల్సిందే. అయితే ఏపీ ప్రభుత్వం ఈ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ పథకం కింద ఇంటర్నెట్ , ఫోన్ సదుపాయాన్ని కల్పించింది. మరి ఈ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఫైబర్ గిడ్ లో ప్రారంభించి మొదటి ఫోన్ కాల్ సీఎం చంద్రబాబు తో మాట్లాడాలని విన్నవించుకున్నారు. గ్రామస్థుల కోరికమేరకు దావోస్ లో ఉన్న సీఎం చంద్రబాబు తో అధికారులు ప్రస్తావించారు. అనంతరం దావోస్ నుంచి జాజివలస గ్రామస్థులకు చంద్రబాబు ఫోన్ చేసి ఫైబర్ గ్రిడ్ సేవలు ఎలా ఉన్నాయంటూ స్థానిక మహిళల్ని అడిగి తెలుసుకున్నారు.వారితో వీడియో కాల్ మాట్లాడారు..స్వయంగా ఫోన్ చేయడంతో ఆ గ్రామం మొత్తం ఆనంద డోలికల్లో మునిగిపోయింది.మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సారు. మా ఊరికి ఫోను ఇచ్చారు.. మీకు కృతజ్ఞతలు సారూ అంటూ జాజివలస మహిళలు చంద్రబాబుతో అన్నారు.