వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే ఇవాళ్టితో పాదయాత్రకు జగన్ బ్రేకులు వేయనున్నారు.. ఆస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని షరతు విధించిన నేపథ్యంలో అయన తప్పనిసరి శుక్రవారంనాడు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో యాత్ర సాగుతుండగా ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకొని రేపు ఉదయం కోర్టుకు హాజరవుతారు తిరిగి రేపు రాత్రికి శింగనమల చేరుకొని శుక్రవారం రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాగా జగన్ పాదయాత్ర నేటితో 400 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నట్టు పార్టీ తెలిపింది..