ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన జగన్ 2019 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాకపోతే తనకు ముందుగా బీజేపీ ఓ హామీ ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తే మరోమారు ఆలోచించకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. చంద్రబాబు అసత్య ప్రచారాలతో మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4ఏళ్లు అవుతున్నా ఏపీ రాజధాని నిర్మాణం ప్రారంభం కాలేదని .. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
మరోవైపు గతంలో నేషనల్ మీడియా కొన్ని కథనాల్ని ప్రసారం చేసింది. బీజేపీ తో కలిసి పనిచేసేందుకు జగన్ అధిష్టానంతో సంప్రదింలు జరిపారని గగ్గొలు పెట్టింది. అంతకు ముందు పలు అంశాల్లో బీజేపీ కి వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఏమాంత్రం వెనుకాడలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతు మద్దతు! ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే మద్దతు! ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా... రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలు! దీంతో పేరుకే ప్రతిపక్షమైనా కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే ఆర్ణబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీలో జగన్ వార్తను హైలెట్ చేస్తూ జగన్ బీజేపీతో చేతులు కలిపిందేకు అంతా సిద్ధం. అందుకు వైసీపీ కి మధ్య వర్తిగా గాలిజనార్ధన్ రెడ్డి బీజేపీకి చెందిన ముగ్గురు పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆచర్చలు సఫలమై వచ్చే ఎన్నికల్లో బీజేపీ - వైసీపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తేటతెల్లమైంది. . ఇక వైసీపీ తో కలిసి పనిచేయాలా..టీడీపీ తో కొనసాగాలా అన్న విషయాలపై ఆరాతీసిన బీజేపీ పార్టీ ప్రయోజనాల లక్ష్యంగా నిర్ధేశించుకుంటూ వచ్చే ఎన్నికల్లోపు తేల్చేస్తుందని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఇలాంటి సంకేతాలు వెలువడిన మరుసటి రోజే.. ‘ఎన్డీయేలోకి జగన్’ అంటూ రిపబ్లిక్ టీవీ పేర్కొనడం విశేషం.