అడిలైడ్ టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. మూడోరోజు ఆస్ట్రేలియాను 235 పరుగులకు ఆలౌట్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ పోరాడినా... మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు త్వరగానే ఔట్ చేయడంతో కోహ్లీసేనకు 15 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత నిలకడగా ఆడుతోంది... పుజారా , కోహ్లీ పార్టనర్‌షిప్‌తో టీమిండియా పుంజుకుంది. లంచ్ విరామ సమయానికి భారత్ స్కోర్ 260 పరుగులు 5 వికెట్ల నష్టానికి. ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచే అవకాశముంటుంది. ఇప్పటికి 275 స్కోర్ లీడ్ లో ఉంది టీమిండియా. ప్రస్తుతం పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో చివరిరోజు నిలవడం ఆసీస్ కు అంత సులభం కాకపోవచ్చు.