ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ గురించే తెలిసే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల పోరులో నిలబడుతుందని తర్వలోనే కాంగ్రెస్ పార్టీ తరుపున భారీ బస్సుయాత్రను జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నమని బైరెడ్డి పెర్కోన్నారు. క్రిస్మస్ కానుకల పేరుతో దళిత ప్రజలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాని తన మాయాలను ఎవరూ నమ్మరని పెర్కోన్నారు. కాంగ్రెస్ అధిష్ఠనం ఆదేశిస్తే కుప్పం(చంద్రబాబు), పులివెందుల(జగన్) లపై తాను పోటీ చేసేందుకు సిద్ధమేనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.