కరీంనగర్ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన ఊబిది స్వప్నను ఆమె భర్త కనకయ్య తుపాకితో కాల్చాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. కనకయ్య ఉపాధి నిమిత్తం నేపాల్‌లోని ఖాట్మండులో ప్లాస్టిక్ సామాగ్రి, కవర్లు, పేపర్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 4నెలల క్రితం పేపర్లు ఏరుతుండగా ఓ తుపాకి దొరకడంతో స్వగ్రామానికి వచ్చాడు. నిన్న సాయంత్రం ఏం జరిగిందో ఏమో భార్య స్వప్న పొత్తి కడుపులో కాల్చాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ కమలాసన్‌రెడ్డి ఆరా తీశారు.