కేంద్రం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పుస్తకాల బ్యాగు బరువు ఎంతెంత ఉండాలంటే..
బడికి వెళ్లే పిల్లలకు పుస్తకాల బ్యాగుల భారం ఇకపై తగ్గనుంది. చిన్నపిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం పిల్లల బ్యాగుల భారంపై దృష్టిసారించింది. ఇకపై చిన్నపిల్లలకు వారి శరీర సామర్ధ్యత రీత్యా స్కూల్ బ్యాగులు ఎంతెంత బరువుండాలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పుస్తకాలతో వంగి నడుస్తూ తరచూ తలెత్తి చూడడం వల్ల మెడ నరాలపై భారం పడి నొప్పి వచ్చే ప్రమాదం ఉందని.. వెన్నెముకలో మార్పు చోటుచేసుకోవచ్చు అది.. నొప్పికి దారి తీస్తుందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు..
*ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో వారి మాతృబాష, గణితం సబ్జెక్టులు మాత్రమే ఉండాలి.
* 3 ,4, 5 తరగతుల విద్యార్థులకు బాష, గణితం సబ్జెక్టుల తోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి.
*విద్యార్థులకు అదనపు పుస్తకాలను తెచ్చుకోవద్దని చెప్పకూడదు.
*పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఒకటి, రెండు తరగతుల *విద్యార్థులకు ఇంటి పని( హోంవర్క్) ఇవ్వకూడదు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి..
తరగతి బరువు(కిలోలు)
1-2 1.5
3-5 2.3
6 -7 4
8-9 4.5
10 5