జగన్‌పై దాడి కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు విచారించింది. సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మరింత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారంలోపు సిట్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరుపు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నాయి. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.