హీరోయిన్ తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రేక్షకులు మండిపడ్డారు.
‘ఝమ్మంది నాదం’ సినిమా షూటింగ్ లోడైరక్టర్ రాఘవేంద్రరావు తన బొడ్డుపై పూలు, పండ్లు, కొబ్బరికాయలు విసిరారంటూ హేళనచేస్తూ మాట్లాడింది. దీంతో డైరక్టర్ పై భయమేసిందని ...హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు విసిరే డైరెక్టర్‌తో శ్రీదేవి, జయప్రద లాంటి వారు కూడా నటించారని గుర్తు చేసింది. అసలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేస్తారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేగడంతో..కావాలని అనలేదని సెలవిచ్చింది. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ టాలీవుడ్ కు చెందిన ఓ హీరో వల్ల టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ వచ్చినట్లు తెలిపింది. ఓ చిత్రం నుంచి తనని తొలగించేలా ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్ తొలగించారని తెలిపింది. ఇదే విషయం ఆ సినిమాకు పనిచేసిన డైరక్టర్ తనతో స్వయంగా చెప్పినట్లు సూచింది.
ఇక టాలీవుడ్ లో ‘ఆనందో బ్రహ్మ’ తరహా పాత్రలు వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది. ‘ఆనందో బ్రహ్మ’తనకు నచ్చి చేసినట్లు .. ఆ సినిమా దర్శకనిర్మాతలు తన కోసం సంవత్సరం పాటు వెయిట్ చేశారని, లాభాల్లో వాటా ఇచ్చారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ సినిమాతో కోటి రూపాయలు తనకి వచ్చాయని తాప్పీ తెలిపింది.