టాలీవుడ్ హీరో నాని కారుకు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ శ్రీనివాస్ నిద్ర మత్తులో నడవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం పై నాని స్పందించారు. ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులెవరు ఆందోళన చెందవద్దని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన పెదవికి స్వల్ప గాయం అయిందని వారం రోజుల్లో కోలకుంటానని సూచించారు. కొంతకాలం విరామం తరువాత కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో మళ్లీ యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో నాని కారు బెలూన్లు తెరుచుకోవడం వల్లే ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్నపోలీసులు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో మద్యం సేవించలేదని..నిద్రమత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ ....పోలీసులకు తెలిపారు.