అదేంటీ..? బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు స్నేహితులకే బీజేపీ అధ్యక్ష పదవి ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా..? అవునండీ అది ముమ్మాటికి నిజమే..? ఎందుకంటే బడ్జెట్ పై ఎంత నిష్టూరమాడినా వాళ్లిద్దరు ఇద్దరు మిత్రులేనంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్ . దానికి కారణం లేకపోలేదు.
కేంద్రంలో బీజేపీ - టీడీపీ మిత్రబంధం హాట్ టాపిగ్గా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే తెగదెంపులు చేసుకోవడం ఖాయమనే అనిపిస్తుంది. అయితే ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర బీజేపీ మాత్రం సీఎం చంద్రబాబుకు పెద్ద పీఠవేస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
కేంద్ర బీజేపీ నాయకత్వం ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది. అందుకు తగ్గ నాయకుడ్ని అన్వేషించే పనిలో పడింది. అయితే ఆ నాయకుడికి చంద్రబాబును విమర్శించకుండా సన్నిహితంగా ఉండే లక్షణాలుంటే అందుకు అర్హులనే విషయాన్ని పార్టీ నేతలకు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
అయితే ఈ అంచాన ప్రకారం బీజేపీలో చీలికలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ టీడీపీ సఖ్యతతో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిలు టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
అయితే ఏపీలో పార్టీని బలపరిచేందుకు సిద్ధమైన బీజేపీ ఇందులో భాగంగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు అధ్యక్ష స్థానానికి ఓకే చేసినట్లు టాక్ . దీనిపై అదిష్టానం నూతన రథసారథుల విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఆయన వ్యతిరేక వర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.