76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో కోలకతా విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శుక్రవారం గువహటికి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. టేకాఫ్ తీసుకున్నకొన్నినిమిషాల్లోనే ఫైలెట్లకు ఈ విషయం అర్ధమైంది. దాంతో అత్యవసరం ల్యాండ్ కు ఉపక్రమించారు. ఈ విషయాన్నీ కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృవీకరించారు. కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో లోపాన్ని గుర్తించినట్టు వారు చెప్పారు. పైలట్‌ల అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.