ఇప్పటికే ప్రత్యేక హోదాకై పోరు సాగుతూనే ఉంది. మరో పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై నిప్పులు చేరుగుతున్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని, ఏపీ త్రీవ అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడుతున్నా విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో వచ్చే నెల జనవరి 6వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న సభకు ప్రధాని మోడీ విచ్చేయుచున్నారు. సోమవారం మదనపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భారత యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రమేశ్‌నాయుడు మాట్లాడారు. ఆ తీపికబురు అంటే ప్రత్యేకహోదా గురించేనా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఖచ్చితంగా చెప్పలేను కాని తప్పకుండా ఏపీ ప్రజలకు తీపి కబురు అయితే అందుతుందని ఎన్. రమేశ్‌నాయుడు వెల్లడించారు.