ఢిల్లీలో 26వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అథ్యక్షతన జరిగింది. జీఎస్టీ రిటర్న్ ల సరళీకరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఈ అంశంపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పాటు జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ గల సరుకులు రవాణాకు ఉండాల్సిన ఈ-వే బిల్లుపై అరుణ్ జైట్లీ కీలక వివరాలు వెల్లడించారు. తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ పన్నులను ఎగ్గొట్టేవారిని అరికట్టడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పన్నుల ఎగవేత వంటి వాటికి పాల్పడుతోన్న ప్రక్రియను ఈ బిల్లు వల్ల అరికట్టవచ్చని జైట్లీ చెప్పారు. ఇక ఎలక్ట్రానిక్-వే బిల్లును వచ్చేనెల 1 నుంచి దశలవారిగా అమల్లోకి తీసుకొస్తామని, ఈ ఏడాది జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుందన్నారు.