దేశవ్యాప్తంగా 'మీ టూ' ఉద్యమం జరుగుతున్న తరుణంలో గూగుల్ ఉద్యోగులు పనికి విరామం ప్రకటించి ఆందోళన బాటపట్టారు. పలువురు ఉద్యోగులు ఎదుర్కుంటున్న లైంగిక వేధింపుల ఆరోపణల పట్ల కంపెనీ వ్యవహారశైలిపై వారు నిరసన తెలిపారు. పనిప్రదేశంలో కొంత మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ ఉన్నతాధికారులకు గూగుల్ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందన్న వార్తలపై వారు మండిపడుతున్నారు. ఇకపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగిస్తూ వాక్అవుట్ చేశారు. ఇదిలావుంటే ఉద్యోగులు పలు నిర్మాణాత్మక సూచనలతో ముందుకొచ్చారని, వారి సూచనలను అమలు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.