బంగారం ధర చుక్కలనంటింది. ఒక్కరోజులోనే 990 రూపాయలు పెరిగింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర 31వేల 350 రూపాయలకు చేరింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఇదే ఫస్ట్ టైమ్.
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ఇర్మా ప్రభావంతో పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి 42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,353 డాలర్లు పలుకుతోంది.