కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన విభజన చట్టాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇందిరా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాయని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలిపించిందన్నారు. 30 నుంచి 40 మంది కాంగ్రెస్ నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. విభజన అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు.