కోర్టు మెట్లెక్కిన ట్రంప్ మూడో బాధితురాలు

Update: 2018-03-21 08:39 GMT

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్ర‌మ‌సంబంధాలు వ‌రుస క‌థనాల‌తో వెలుగులోకి వ‌స్తున్నాయి.స్టెఫానీ క్లిఫోర్డ్, స్టామీ డానియోల్ ఇప్పుడు డేవిడ్ పెక‌ర్. ఈ ముగ్గురికి డొనాల్డ్ ట్రంప్ కు మ‌ధ్య ఉన్న బంధం గురించి అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. 
  గ‌తంలో స్టెఫానీ క్లిఫోర్డ్ తో ప్రేమాయణం నెరిపిన ట్రంప్ కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. 
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపిచాడు.
కొద్దిరోజుల‌కు  ట్రంప్ పోర్న్ స్టార్ స్టామీ డానియోల్ తో శారీర‌క సంబంధాన్ని కొన‌సాగించాడు. ఆ సంబంధాలు బ‌య‌ట‌కు పొక్క‌కుండా స్టామీకి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు ముట్ట‌జెప్పార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై వైట్ హౌస్ వ‌ర్గాలు కొట్టిపారేసినా  ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ కెయిత్ మున్యాన్ ట్రంప్ శృంగార ర‌హస్యాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. ఓ టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కెయిత్ ట్రంప్ - స్టామీల బంధం ఎలాంటిదో చెప్పాడు.  
తాజాగా  ప్లేబాయ్ మాజీ మోడ‌ల్ క‌రెన్ మెక్ డౌగ‌ల్ లాస్ ఏంజిల్స్ సుపీర‌య‌ర్ కోర్టును ఆశ్ర‌యించింది. 
ట్రంప్ కు త‌న‌కు ఎఫైర్ ఉంద‌ని..ఆ  విష‌యం భ‌య‌ట‌కు పొక్క‌కుండా ల‌క్షా 50వేల డాల‌ర్లు చెల్లించిన‌ట్లు..ఆ ఒప్పొందం నుండి విముక్తిని క‌లిగించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా ట్రంప్ కు త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన శృంగార కార్య‌క‌లాపాల్ని వివ‌రించింది. 
2006-07 ట్రంప్ భార్య మెలానియా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌తో 10 నెల‌ల‌పాటు శృంగార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించాడని,  అదే స‌మ‌యంలో ఫోర్న్ స్టార్ తో కూడా  ట్రంప్ త‌న వివాహేత‌ర సంబంధాన్నిపెట్టుకున్నాడ‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.   2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ పోర్న్ స్టార్ డానియేల్ ‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ తనతో రహస్యంగా సంప్రదింపులు జరిపారని మెక్ డౌగల్ ప్రకటించారు.
ఇక త‌నకు - ట్రంప్ మ‌ధ్య ఉన్న సంబంధాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా త‌న స్నేహితుడు డేవిడ్ పెక‌ర్ నిర్వ‌హిస్తున్న అమెరికా మీడియా ఇంక్ త‌రుపున త‌న‌కు లక్లా 50వేల డాలర్లు చెల్లించిన‌ట్లు ఒప్పుకుంది.  ఇప్పుడు ఆ ర‌హ‌స్య బంధం నుంచి త‌న‌ని విముక్తి చేయాలంటూ క‌రెన్ మెక్ డౌగ‌ల్ కోర్టును ఆశ్రయించింది. 
 

Similar News