రాష్ట్ర రెండుగా విడిపోవడంతో కష్టాల్లో పడిన ఆంధ్రప్రదేశ్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులే ద్యేయంగా లోకేష్ ఇటీవల చైనాలో పర్యటించారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తిరుపతిలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని కంపెనీ తెలుపుతోంది. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తాను చైనా పర్యటనలో ఉన్నప్పుడు… వివిధ అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు రమ్మని ఆహ్వానించామని అన్నారు. వందలాది పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతుందని.. త్వరలోనే దేశంలో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుందని.. లోకేష్ అన్నారు.