పద్మావత్ సినిమా వివాదం పై హీరోయిన్ దీపికా పదుకొని తనదైన స్టైల్లో రిప్లయి ఇచ్చింది. డైరక్టర్ బన్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన కర్ణిసేనను కించపరిచేలా పద్మావత్ ఉందంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదల కాకుండా ప్రయత్నాలు చేశారు. అంతేకాదు సినిమాలో పద్మావత్ గా యాక్ట్ చేసిన దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి ఐదు లక్షల్ని బహుమతిగా ఇస్తామని కర్ణిసేన ప్రకటించింది. కర్ణిసేనకు మద్దతకు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆఫర్ పై స్పందించిన దీపికా తాను అలాంటి వాటికి భయపడే రకాన్ని కాదంటూ 14ఏళ్ళ వయసులో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇక్కముక్కకోసే విషయంలో ఆలోచించడి. నాకు మక్కంటే చాలా ఇష్టం కాళ్లు పొడుగ్గా ఉంటాయి కనుక...ఓ కాలు తీసుకోమని చెప్పింది.
తనకు 14ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి రెస్టారెంట్ నుంచి వస్తుండగా ఓ వ్యక్తి తన చేయిపట్టుకొని వేధించాడని దీంతో వాడి కాలర్ పట్టుకొని బహిరంగంగానే చెంప పగలగొట్టానని చెప్పుకొచ్చింది. ఇలాంటి సంఘటనలు అమ్మాయిలకు జరిగినప్పుడు బయపడకుండా ఎదిరించాలని హితువు పలికింది. పద్మావత్ సినిమాలో తన క్యారక్టర్ గురించి సెటైర్లు వేసిన హీరొయిన్ స్వర భాస్కర్ పై దీపికా దానికి బదులు ఇచ్చింది. ఈ సినిమా ఎందుకు తీశారనే విషయం తనకు అర్దం కాలేదు. కాబట్టే ఇలా మాట్లాడుతుందని .. సరైన టైం లో రిఫ్రెష్ అవ్వడానికి బయటికి వెళ్ళినప్పుడు కీలకమైన సీన్స్ మిస్ అయ్యుండొచ్చు అని చురక వేసింది.