గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ళ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుణ్ణి పట్టుకోవాలంటూ స్థానికులు రాత్రంతా అద్దంకి -నార్కెట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని తెల్లవారుజాము వరకు డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్యాచార ఘననకు నిరసనగా దాచేపల్లి వాసుల ఆందోళనకు దిగడంతో అద్దంకి -నార్కెట్‌పల్లి రహదారిపై దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ భారీగా నిలిచి పోవడంతో పోలీసులు నిందితుడిని మధ్యాహ్నం లోపు అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెల్లవారు జామున బాధితులు ఆందోళన విరమించారు. మరోవైపు అత్యాచార ఘననను నిరశిస్తూ...ప్రస్తుతం దాచేపల్లి బంద్ పాటిస్తున్నారు.