శ్రీనివాస్ కు ఈ నెల 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్

Update: 2018-11-03 02:54 GMT

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి కేసులో ప్రధమ నిందితుడుగా ఉన్న శ్రీనివాస్‌ పోలీసు కస్టడీ పొడిగింపునకు విశాఖ జిల్లా కోర్టు నిరాకరించింది. ఈనెల 9వరకు శ్రీనివాస్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిన్నటితో పోలీసుల కస్టడీ ముగియడంతో శ్రీనివాస్‌ కస్టడీని పొడిగించాలని సీట్ అధికారులు కోర్టును కోరారు. అయితే పోలీసుల కస్టడీకి కోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పు అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు. కాగా గతనెల 25న జగన్ పై శ్రీనివాసరావు కోడికత్తితో హత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో జగన్ చాకచక్యంగా తప్పించుకున్నారని సిట్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలావుంటే జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అంటూ ఏపీ పోలీసులు చేసిన స్టేట్‌మెంట్ పై పెద్ద రగడే జరుగుతోంది. శ్రీనివాసరావు తలిదండ్రులు మాత్రం తమ కొడుకు అసలు జగన్ అభిమాని కాదని స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Similar News