ప్రత్యేక హోదా పోరాటం.. ఉధృతమవుతోంది. విభజన సమస్యల పరిష్కారంపై ఇటు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భేటీలు, సమావేశాలతో వేడి పుట్టిస్తుంటే అటు కాంగ్రెస్ మాత్రం ఏకంగా కేంద్రంతోటే ఢీ కొట్టబోతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యల కలకలం రేపుతున్న సమయంలో ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇదే విషయంపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒప్పించారు. విభజన సమస్యలపై ఇప్పటికే 184 నిబంధన కింద నోటీసులిచ్చిన కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తుంది.