అమరావతికి ఆళ్లగడ్డ పంచాయతీ

Update: 2018-04-24 05:45 GMT

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పంచాయతి అమరావతి చేరింది. తాజా ఘటనలను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు ఇరు వర్గాలను అమరావతి రావాలంటూ ఆదేశించారు.  ఈ రోజు ఆళ్లగడ్డలో జరుగుతున్న శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  ఇరు వర్గాలు అమరావతి చేరుకోనున్నాయి. కలిసి పని చేయాలంటూ ఇప్పటికే పలు సార్లు సూచించినా ఫలితం లేకపోవడంతో  సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రతిష్ట ముఖ్యమని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ భేటి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది,. 

Tags:    

Similar News