తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మరికాసేపట్లో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.