వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు. జగన్ మోహన్ రెడ్డికి కనీసం పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. అసలు జగన్‌కూ ఎకనామిక్స్, సోషియాలజీ గురించి తెలియదని చంద్రబాబు అన్నారు. నేడు సంక్షేమ రంగంలో ఏపీ సర్కార్ సాధించిన ప్రగతిపై సిఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ రెస్టారెంట్లకన్నా అన్న క్యాంటీన్లలోనే చాలా శుభ్రత, నాణ్యత ఉంటుందిని అన్నారు. ఇంత రూచికమైన భోజనాల అందిస్తూన్న క్యాంటిన్లు ఎక్కడైనా ఉన్నాయని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షేమ పథకాలతోనే ప్రజలకు మేలుజరిగే విధంగా చూస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా తెదేపా పార్టీయే విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమావ్యక్తం చేశారు.