టీడీపీ ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడకూడదని హెచ్చరించారు. ధర్మపోరాటంపై కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కొందరు తప్పుడు వీడియో క్లిప్పింగులు తీస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. సరదాగా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. వీడియోను ఎవరు తీశారు.. ఎందుకు ప్రసారం చేశారన్న దానిపై విచారణ చేయిస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలంతా ధర్మపోరాటం వైపే చూస్తున్నారని.. ఎంపీల ఉద్యమంపై ఆశలు పెట్టుకున్నారని.. చంద్రబాబు స్పష్టం చేశారు. మురళీ మోహన్ అన్న మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారని.. రాష్ట్ర ప్రజలకు హాని చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మీడియా ముసుగులో అరాచక శక్తులు చొరబడకుండా చూడాలన్నారు. కుట్రదారుల చేతుల్లో పావులుగా మారి.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని సూచించారు.