ఓడిపోతామనే భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని సీఎ చంద్రబాబు విమర్శించారు. బైపోల్స్ వస్తే 5 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయేదన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. 2014లో తిరుపతి ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నామని చెప్పారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై.. ప్రజల్ని చైతన్య పరచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఐక్యంగా పనిచేస్తే తిరుపతి ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు తథ్యమని తిరుపతి నేతలతో చంద్రబాబు చెప్పారు. బీజేపీ, వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. గ్రామదర్శిని, గ్రామ సభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జిలు, పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు.