తిరుమలలో వేసవి రద్దీ గణనీయంగా పెరగడంతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 50 గంటల సమయం పడుతుంది. దీంతో తిరుమలలోని టైం స్లాట్ సర్వదర్శన కౌంటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. తిరుపతి కంటే తిరుమలలో అధికశాతం మంది భక్తులు టోకన్లు పొందడం వల్ల నిరీక్షించే సమయం 40 గంటలు దాటుతుందని, దీని కారణంగా మూడురోజులపాటు భక్తుడు కొండపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అయుతే తిరుపతిలో యధావిధిగా కౌంటర్లు పనిచేస్తాయని, రద్దీ సాధారణ స్థితికి వచ్చిన అనంతరం తిరుమలలో కౌంటర్లు తెరిచే విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ టైం స్లాట్ విధానం ద్వారా 21వ తేదీ వరకు 4లక్షల రెండువేల 11 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్న రని ఆయన తెలిపారు. అలాగే రద్దీ క్రమంగా పెరుగుతుండడం వల్ల తోపులాటలు జరిగే ప్రమాదం కూడా ఉందని, కావున సర్వదర్ సర్వదర్శన ప్రవేశ మార్గాన్ని లేపాక్షి కూడలికి మారుస్తున్నట్లు జేఈవో తెలిపారు.