12 ఏళ్లుగా సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయమేం కాదు. అలాంటి ఫీట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్. ఇప్పుడు కూడా.. కాజల్ హవా కొనసాగుతోందంటే.. ఆమెకున్న టాలెంటే కారణం. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ఎమ్ ఎల్ ఏ సినిమా చేస్తున్న కాజల్.. ఇదే విషయంపై స్పందించింది. ఇన్నేళ్ల అనుభవంలో ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిన విషయాలు ఏంటి అని అడగ్గానే.. ఇదిగో ఇవీ అంటూ జవాబిచ్చింది.
ఎంచుకున్న కథలు.. చేసిన సినిమాలే.. తనకు ఎక్కువగా సంతృప్తి ఇచ్చాయని కాజల్ చెప్పింది. అందరికీ ఇలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ.. తనకు మాత్రం వృత్తి పరంగా ఎంచుకున్న సినిమాలు.. చేసిన క్యారెక్టర్లే చాలా నచ్చుతాయని.. మనసు పెట్టి నటిస్తాం కాబట్టి.. అవి సంతృప్తి పరుస్తాయని కాజల్ చెప్పింది. ఇలా.. వృత్తి పరంగా అడుగు ముందుకు వేస్తేనే అసలైన సంతృప్తి సాధ్యమంటూ సక్సెస్ సీక్రెట్ కూడా చెప్పేసింది. ఇంత ప్రొఫెషనల్ గా ఉంటుంది కాబట్టే.. కాజల్ ఇంకా హీరోయిన్ గా సక్సెస్ అవుతోంది. కాదంటారా?