ఎపి సీఎం చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసినట్టున్నారు. ఐదు రాష్ట్రల్లో ఎన్నికల ప్రచారం జరిగిన నేపధ్యంలో బిజెపియోతర కూటమి ఏర్పాటుకు చిన్న గ్యాప్ వచ్చింది. ఇక ఎన్నికల పర్వం ముగియడంతో చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ బాట పట్టారు. నేడు జాతీయ స్దాయి నేతలను కలవడం తోపాటు కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత నెల 22వ తేదిన జరగాల్సిన సమావేశం ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇవాళ హస్తినలో బీజేపీయేతర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు. కాగా చంద్రబాబు ఇవాళ 12 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు జరిగే బీజేపీయేతర పార్టీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవుతారు. అనంతరం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన మహాకూటమి ఇవాళ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూఖ్ అబ్దుల్లా, దేవెగౌడ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు హాజరుకానున్నారు.