బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా.. కూటమి ఏర్పాటే లక్షంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. అలాగే నిన్న(గురువారం) కర్ణాటక సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవగౌడను కలిసిన చంద్రబాబు.. మోడీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రా ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు. మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని ఇటీవల ఢిల్లీ వేదికగా చెప్పిన బాబు.. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేస్తున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామి భేటీ అనంతరం తెలిపారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.