మోడీ, కేసీఆర్‌పై చంద్రబాబు ఫైర్

Update: 2018-12-24 13:06 GMT

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు. ప్రధాని మోదీకి గుజరాత్ పై ఉన్న మక్కువ పోలవరం ప్రాజెక్ట్ పై లేదని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు కోరారు. విభజన జరిగిన నేపథ్యంలో తెలుగువారందరూ కలిసి ముందుకుపోవాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి కాకుండా కెసిఆర్ చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని, తెలుగు జాతిబాగుండాలని కోరుకున్న అని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు పలుకుతూ ఏపీకి ద్రోహం చేస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారో నాకు తెలియదని చంద్రబాబు అన్నారు. కాని పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఒడిషాకు ఎలాంటి నష్టం ఉండబోదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుతానని చంద్రబాబు అన్నారు చెప్పారు.

Similar News