మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి, సివేరి సోమల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించింది. హత్య జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు బాబు కిడారి, సివేరి కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడిన ఆయన అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ హామి ఇచ్చారు. ప్రజా ప్రతినిధులను హతమార్చడం ద్వారా మావోయిస్టులు ఘోరమైన తప్పిదానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూ గతంలోనే చెప్పినా ఈ సాకుతోనే మావోయిస్టులు హత్యలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పాటుపడేవారిని చంపితే .. గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయంటూ ప్రశ్నించారు.