ఛలో సినిమా రివ్యూ

Update: 2018-02-02 00:10 GMT

హీరో నాగ‌శౌర్య ఛ‌లో కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా షూటింగ్ నుంచి విడుద‌ల వ‌ర‌కు అన్నీంట్లో జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఈ ల‌వ‌ర్ బాయ్ ప్ర‌మోష‌న్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆడియో ఫంక్ష‌న్ కు మెగ‌స్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. దీంతో మెగా అభిమానులు నాగ‌శౌర్య‌కు ఫిదా అయ్యారు. మ‌రి నాగ‌శౌర్య ప‌డిన క‌ష్టం వృధా అవుతుందా ? లేదా.? అనేది తెలుసుకుందాం..?
కథ: 
హరి(నాగశౌర్య) ఓ పోకిరి చిన్న వ‌య‌స్సు నుంచి గొడ‌వ‌లు, కోట్లాట‌లు అంటే చాలా ఇష్టం. దీంతో విసుగెత్తిన త‌ల్లిదండ్రులు హ‌రిని తమిళనాడు సరిహద్దు ప్రాంతం 'తిరుప్పురంస‌కు వాళ్ల  బంధువుల ఇంటికి పంపుతారు.   అస‌లే కోట్లాట‌లు , కుమ్మ‌లాట‌లతో చీలిపోయిన  తెలుగు- త‌మిళ‌వ‌ర్గం ఆ ఊరిలో ఓ కంచెను వేసుకొని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటుంటారు. అయితే  అప్పుడే వ‌చ్చిన హ‌రిని చూసిన కొంత‌మంది త‌మిళులు  అత‌న్ని చంపాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తారు.
 అస‌లే తెలుగు వాడు అయిన హ‌రి  త‌మిళ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ నాయ‌కుడి కూతురు  కార్తీక(రష్మిక)ను ప్రేమిస్తాడు . కానీ హ‌రిని కార్తీక ప్రేమించ‌దు.  కానీ ఆరెండు ఊళ్ల‌ని క‌లిపేందుకు కార్తీక ఊరు ఒక్కటిగా కలిస్తేనే తప్ప మన ప్రేమ గెలవదని మెలిక పెడుతుంది. మరి తన ప్రేమ కోసం హరి ఊరిని ఒక్కటిగా చేశాడా..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అనేదే మిగిలిన కథ. 

విశ్లేషణ: 
1953లో రెండు వర్గాల వారు ఊరు మధ్యలో కంచె ఏర్పాటు చేసుకొని హద్దులు విధించుకుంటారు. అలా ఊరికి వ‌చ్చిన హీరో ఆ గొడ‌వ‌ల్ని ఎలా ప‌రిష్క‌రిస్తాడ‌నేది సినిమా వృత్తంగా తెర‌కెక్కింది. ఈ క‌ధ‌లో సీరియ‌స్ నెస్ త‌గ్గించి కామెడీ ట్రాక్ మీద ఎక్కువ కాన్స‌న్ ట్రేష‌న్ పెట్టిన‌ట్లుంది. ప్ర‌తీ సిచ్యూవేష‌న్ కు త‌గ్గ‌ట్లు కామెడీ పెట్టించ‌డంతో సినిమా మొత్తం న‌వ్వులు పువ్వులు పూయిస్తుంది. కాలేజ్‌లో హీరో ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. అప్పటివరకూ సరదాగా సాగిపోయిన సినిమా కాస్త సెకండ్ హాఫ్‌లో కాస్త స్లోగా నడుస్తుందనిపిస్తుంది. 
ఆ ఊరిలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లేంటి తెలుసుకొని ఒక్క‌టిగా చేసే ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్లు తెల‌స్తోంది.  ఏదైతేనేం మొత్తానికి ఆడియన్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు. 
సినిమా మొదలవ్వడం ఆసక్తికరంగా మొదలవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. ఈ సినిమా కోసం తన శాయశక్తులా కృషి చేశాడు నాగశౌర్య. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. రష్మిక ప్రతి ఎమోషన్‌ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. నరేష్, అచ్యుత్ కుమార్, రాజేంద్రన్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలతో మెప్పించారు. సత్య, వైవా హర్షల కామెడీ బాగా పండింది. రఘుబాబు ప్రిన్సిపల్ పాత్రలో సూట్ అవ్వలేదు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహతి స్వర సాగర్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లో ఒకటి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలుభారీగా ఉన్నాయి. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే ఈ సినిమా కుటుంబసమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Similar News