నాగ శౌర్య.. హీరోగా రూపొందిన ఛలో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగుతుంది. రవితేజతో పోటీపోటాగా బరిలోకి దిగిన ఛలో రిజల్ట్ ఎలా ఉంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఛలో సినిమా విడుదల తరువాత డైరక్టర్ వెంకట్ కుడుముల కామెడీ, మ్యూజిక్ మీద కాన్సట్రేషన్ చేయడంతో సినిమా వసూళ్లు బాగున్నాయని తెలుస్తోంది.
ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే టాప్ డైరక్టర్ల నుంచి వచ్చిన శిష్యులు సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. కానీ త్రివిక్రమ్ శిష్యుడిగా వచ్చిన వెంకట్ ఛలో సినిమాతో ఆ ఆపవాదును చెరిపేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. సినిమా విడుదలతో మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినా పోటా పోటీగా ఏ సినిమా లేకపోవడం, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉండడంతో కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. దీంతో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు ఛలో బాగుందని మౌత్ పబ్లిసిటీ బాగా వినిపిస్తోంది. వచ్చే వారం ఒకే రోజు గాయత్రి, రాజుగాడు, కిరాక్ పార్టీ విడుదల కానున్నాయి. వీటిని తట్టుకొని థియేటర్స్ ను కాపాడుకోవాలి. అలా చేస్తే వసూళ్లు మరింత ఊపందుకుంటాయి.
ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా చూసుకుంటే 3 కోట్ల 80 లక్షల గ్రాస్ తో 1 కోటి 90 లక్షల దాకా షేర్ ఇచ్చింది. నైజాంలో 60 లక్షలు దాకా గ్రాస్ తెచ్చిన చలో అందులో 32 కోట్ల దాకా షేర్ ఇచ్చింది. సీడెడ్ లో 20 లక్షల గ్రాస్-12 లక్షల షేర్, ఓవర్సీస్ లో కోటిన్నర గ్రాస్ తో 60 లక్షల షేర్, దేశవ్యాప్తంగా 50 లక్షల గ్రాస్ తో 18 లక్షల షేర్ తో ఓ మోస్తరుగా నిలబడ్డాడు. అయితే ఈ వసూళ్లు మార్కెట్ పరంగా చూసుకుంటే నాగ శౌర్యకి మంచి వసూళ్లే అని చెప్పుకోవాలి.