రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు

Update: 2018-10-11 02:18 GMT

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అన్ధంచింది. ఏటా ప్రకటించే దసరా బోనస్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ దసరా బోనస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 11.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్టంగా రూ. 17,951 వరకు బోనస్‌ పొందనున్నారు. అయితే ఇది నాన్‌–గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు మాత్రమేనని స్పష్టం చేసింది. రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) దసరా బోనస్ లేదని రైల్వే మంత్రి తెలిపారు. ఇదిలావుంటే నిన్న(బుధవారం) జరిగిన మంత్రి వర్గం భేటీలో తిరుపతితోపాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞానవిద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్‌ఈఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Similar News