బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ బోలా సింగ్ (80) మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో 1939లో జన్మించిన బోలా.. పట్నా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వామపక్ష భావాజాలం గల ఆయన 1967లో సీపీఐ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రం బెగుసరయ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2000 నుంచి 2005 వరకు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు.