తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకత్వానికి రిటైర్‌మెంట్ అంటూ చెప్పడం విడ్డూరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షీతులు తొలగింపుపైనా ఆకుల మండిపడ్డారు. దేవాలయాలపై పాలకవర్గాల జోక్యం ఏమిటని నిలదీశారాయన.